ముహుర్తాలు, శుభకార్యాలు, పండుగలు, వ్రతాలు మరియు ఇతర ముఖ్యమైన మంచి కార్యక్రమాలకు భారతదేశ హిందువులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది శుభ సమయాలు, అశుభ సమయాలు, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ‘సూర్యమానం’, చంద్రమానం’ విధానాలే ప్రస్తుతం అమలులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల వారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది (ఉగాది) ఛైత్రమాసంతో ప్రారంభమై, ఫాల్గుణమాసంతో పూర్తవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ పంచాంగాలు మార్కెట్‌లో లభించినా… మా శుభసమయం.కామ్ పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. మా పంచాంగంలో… తిథి, వారం, నక్షత్రము, యోగము, కరణము, శుభ సమయాలు (అభిజిత్, అమృతకాలము, గోధూళి ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం), అశుభ సమయాలు (రాహుకాలము, గుళికకాలము, యమగండము, దుర్ముహూర్తము, వర్జ్యం), సూర్యోదయం, చంద్రోదయం గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం (డ్రిక్ గణిత సిద్ధాంతం) అనుసరించి రూపొందించిన రోజువారీ తెలుగు పంచాంగం 2020-2021 (శ్రీ శార్వరి నామ సంవత్సరం) మరియు తెలుగు కేలండర్.
తెలుగు పంచాంగము సెప్టెంబర్ 2022
తెలుగు పంచాంగము ఆగష్టు 2022
తెలుగు పంచాంగము జూలై 2022
తెలుగు పంచాంగము జూన్ 2022
తెలుగు పంచాంగము మే 2022
తెలుగు పంచాంగము ఏప్రిల్ 2022
తెలుగు పంచాంగము మార్చి 2022
తెలుగు పంచాంగము ఫిబ్రవరి 2022
తెలుగు పంచాంగము జనవరి 2022